వైభవంగా బోనాల పండుగ
ABN , First Publish Date - 2022-08-08T06:47:56+05:30 IST
జిల్లావ్యాప్తంగా బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు.

గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన మహిళలు
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లావ్యాప్తంగా బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన బోనంలో నైవేద్యాన్ని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బోనాల సందడితో జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
ముత్యాలమ్మ ఆశీస్సులతో ప్రజలు ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా కోదాడలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ పండుగ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని, ముత్యాలమ్మను దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, పాడిపంటలు కలుగుతాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అన్ని పండుగల్లో భాగస్వామ్యమై ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు అండగా ఉంటోందన్నారు. ముత్యాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం ప్రజలకు స్నేహితుల దినోత్సవం, ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, బుర్రా పుల్లారెడ్డి, ఖదీర్, కోట మధు, మైసా రమేష్, చందర్రావు, వంటిపులి శ్రీనివాస్, ఖాజా, శ్రావణ్, చింతల నాగేశ్వరరావు, బత్తుల ఉపేందర్, గంధం పాండు, వంశీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామదేవతలను పూజించటం మన సంస్కృతి: వేనేపల్లి
గ్రామదేవతలను పూజించటం మన సంస్కృతి అని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. ముత్యాలమ్మకు బోనాల పండుగ సందర్భంగా కోదాడలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు బోనాలు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి యర్నేని బాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మునిసిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషలక్ష్మీనారాయణ, ఎన్ఆర్ఐ జలగం సుధీర్, కౌన్సిలర్లు గుండపనేని నాగేశ్వరరావు, పెండెం వెంకటేశ్వర్లు సుశీలరాజు, మధార్, రమానిరం జన్రెడ్డి, షాపుద్దిన్, గంధం యాదగిరి, సామినేని ప్రమీల, స్వామినాయక్, రవీందర్‌రెడ్డి, సైదయ్య, చిన్న సత్యనారాయణ పాల్గొన్నారు.
- అనంతగిరి మండలకేంద్రంలో ముత్యాలమ్మకు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అంతా సుభిక్షింగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
- మఠంపల్లి మండలంలో ముత్యాలమ్మ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొడ్రాయి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి, ఉపసర్పంచ్ జాల కిరణ్‌యాదవ్, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య, కంటు లక్ష్మయ్య, మహే్‌షగౌడ్, బీవీ రామారావు, బాలకృష్ణ, శేషిరెడ్డి, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో ముత్యాలమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ, బొడ్రాయి, కోటమైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూరుగడ్డ, మాచవరం గ్రామంలో నిర్వహించిన పూజల్లో మహిళలు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.