Rajagopal reddy: మునుగోడుకు కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-10-17T21:06:07+05:30 IST

మునుగోడుకు కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Rajagopal reddy: మునుగోడుకు కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేమీ లేదు

నల్లగొండ: మునుగోడుకు కేసీఆర్ సర్కార్ (KCR Government)చేసిందేమీ లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను రాజీనామా చేయకుంటే మునుగోడు గురించి మాట్లాడేవారే కాదు. నా రాజీనామాతో మునుగోడుకు ప్రభుత్వం కదిలివచ్చింది’’ అని అన్నారు. మునుగోడులో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు ఇంత సైన్యం ఎందుకని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో  తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి (BJP Leader) ఆరోపించారు. 

Updated Date - 2022-10-17T21:06:07+05:30 IST