సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-25T05:49:31+05:30 IST

సంస్కృతీ సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో బొడ్డెమ్మ సంబురాల్లో భాగం గా పోషకాహారం, ఆరోగ్యంపై ఐసీడీఎ స్‌ ప్రాజెక్టు సిబ్బంది, జిల్లాస్థాయి మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుక మ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించా రు.

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
కలెక్టరేట్‌ ఆవరణలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పమేలాసత్పథి 

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 24: సంస్కృతీ సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో బొడ్డెమ్మ సంబురాల్లో భాగం గా పోషకాహారం, ఆరోగ్యంపై ఐసీడీఎ స్‌ ప్రాజెక్టు సిబ్బంది, జిల్లాస్థాయి మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుక మ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్‌ బతుకమ్మ ఆడారు. అదేవిధంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె తిలకించారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.విజయకుమారి, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణవేణి, డీఏవో కె.అనురాధ, డీపీవో ఆర్‌.సునంద, సీడబ్ల్యూసీ చైర్మన్‌ బండారు జయశ్రీ, డాక్టర్‌ ప్రమీల, హార్టికల్చర్‌ జిల్లా అధికారి అన్నపూర్ణ, పరిశ్రమల జిల్లా అధికారి శ్రీలక్ష్మీ, సీడీపీవోలు పాల్గొన్నారు. 

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు 

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 24: నేటినుంచి జిల్లా లో బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర పండుగ, ప్రకృతి పూల పండుగగా పిలుచుకునే బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు మహిళలు సిద్ధమయ్యారు. ఆదివారం ఎంగిలిపూలతో ప్రారంభమయ్యే వేడుకలు అక్టోబరు 3న సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజులపాటు జిల్లాలోని వీధుల్లో బతుకమ్మ ఆటల సందడి నెలకొననుంది. ఇందుకోసం అధికారులు జిల్లా అంతటా ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే అధికారికంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకోసం జిల్లాకేంద్రం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణను ముస్తాబుచేశారు. రోజుకో ప్రభుత్వ శాఖ మహిళా ఉద్యోగినులు బతుకమ్మ ఆడతారు. 

Updated Date - 2022-09-25T05:49:31+05:30 IST