బహజన వీరుడు సర్వాయి పాపన్న
ABN , First Publish Date - 2022-08-19T06:16:59+05:30 IST
బహుజన చక్రవర్తి, బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు అన్నారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 18: బహుజన చక్రవర్తి, బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు అన్నారు. గురువారం పాపన్న జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు నివాళు లర్పించారు. తిరుమలగిరి మండలం వెలిశాల ఎక్స్ రోడ్డు సెంటరులో పాపన్న విగ్రహనికి రాంప్రభు నివాళులర్పించి మాట్లాడారు.
- సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్హాల్లో పాపన్నగౌడ్ చిత్రపటా నికి జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఆసంఘం జిల్లా అధ్యక్షుడు మొగదాల లక్ష్మణ్‌గౌడ్ నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్ పాల్గొన్నారు.
- హుజూర్‌నగర్‌లోని పాపన్నగౌడ్ జయంతిని జైగౌడ సంఘం, గౌడ యువజన సంఘం, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పోటా పోటీగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తండు హరి కృష్ణగౌడ్, పండ్ల హుస్సేన్, శ్రీనివాస్, అమర్, తండు సాయిరాం, పాపన్న, రాజా రమేష్, పులి గోవిందు, యలక సైదులు తదితరులు పాల్గొన్నారు.
- గరిడేపల్లిలో గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ యూత్ అధ్య క్షుడు వల్లపుదాసు జోష్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి నిర్వహిం చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
- నేరేడుచర్లలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లగాని సబ్బుగౌడ్, మఠంపల్లిలో ఎంపీడీవో జానకిరాములు, నడిగూడెంలో కలుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కోదాడలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్, మునగాలలో గుండు అంజయ్య, మామిడి శ్రీనివాస్, చిలుకూరులో జైగౌడ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర గాని లింగయ్య, జిల్లా అధ్యక్షుడు కొండా వీరబాబు, పెన్‌పహాడ్‌లో పోలి శెట్టి సైదులు, బొల్లకొండ శ్రీరాములు, నూతనకల్‌లో తొట్ల ప్రభాకర్, గుర్రం సత్యనారాయణ, తుంగతుర్తిలో గుండగాని రాములుగౌడ్, గ్రంథా లయ కమిటీ చైర్మన్ రమేష్, అర్వపల్లి మండం జాజిరెడ్డిగూడెంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ కుంభం సోమయ్య, మద్దిరాలలో సర్పంచ్ చిలువేరు భవానీలింగరాజు, మండ లంలోని పోలుమళ్ల గ్రామంలో తాళ్లపల్లి యాదగిరి, రేసు వెంకన్న, మద్దిరాలలో సర్పంచ్ చిలువేరు భవానీలింగరాజు ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు.