స్థానిక సంస్థలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి

ABN , First Publish Date - 2022-05-30T06:21:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా నిధులిస్తే తప్పేంటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ప్రశ్నించారు. నేరేడుచర్లలో ఆది వారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దుష్ప్రచారం చేస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు నిధులిస్తుందన్నారు.

స్థానిక సంస్థలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి
శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్ననాయకులు

నేరేడుచర్ల, మే 29: కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా నిధులిస్తే తప్పేంటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ప్రశ్నించారు. నేరేడుచర్లలో ఆది వారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దుష్ప్రచారం చేస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు నిధులిస్తుందన్నారు. సర్పంచులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా అప్పుల పాలు చేసింది ఎవరని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు పార్థనబోయిన విజయ్‌కుమార్‌, సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, గుండెబోయిన వీరబాబు, పల్లెపంగ వీరబాబు, వురిమళ్ల రాంమ్మూర్తి, కొణతం నాగిరెడ్డి, విజయ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, చిలకరాజు కరుణాకర్‌, బొలిశెట్టి శంకర్‌, ప్రవీణ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

గరిడేపల్లి రూరల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అన్నారు. మండలంలోని పొనుగోడులో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలను వివరించాలన్నారు. ముందుగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అందె కోటయ్య, నాయకులు పోలిశెట్టి అంజయ్య, పోకల వెంకటేశ్వర్లు, కర్ణం చంద్రశేఖర్‌, అంజయ్య, బాటసారి, అప్పిరెడ్డి, నాగసైదులు, ఉపేందర్‌, మీరా తదితరులు పాల్గొన్నారు.


Read more