టి-శాటిలైవ్‌కు ఎంపికైన అవంతీపురం విద్యార్థి అశోక్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-03-05T06:32:35+05:30 IST

టీ- శాటిలైవ్‌కు సూపర్‌ స్టూడెంట్‌గా అవంతీపురం గిరిజన కళాశాల విద్యార్థి అ శోక్‌కుమార్‌ ఎంపికైనట్లు గిరిజన కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు రాజారత్నం తెలిపారు.

టి-శాటిలైవ్‌కు ఎంపికైన అవంతీపురం విద్యార్థి అశోక్‌కుమార్‌
అశోక్‌కుమార్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

మిర్యాలగూడ, మార్చి 4: టీ- శాటిలైవ్‌కు సూపర్‌ స్టూడెంట్‌గా అవంతీపురం గిరిజన కళాశాల విద్యార్థి అ శోక్‌కుమార్‌ ఎంపికైనట్లు గిరిజన కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు రాజారత్నం తెలిపారు. శుక్రవారం కళాశాలలో అశోక్‌కుమార్‌ను సన్మానించి మాట్లాడారు. తెలంగాణ విద్యార్థుల కోసం విద్యను అందించడానికి నిర్వహిస్తున్న టి-శాటిలైవ్‌కు జూనియర్‌ కళాశాల విద్యార్థి అశోక్‌కుమా ర్‌, పాఠశాల స్థాయిలో టెన్త క్లాస్‌ ఏ సెక్షన నుంచి చిరంజీవి ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం అభినందించదగిన విషయమని పేర్కొన్నా రు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అజయ్‌కుమార్‌, సక్రు, పుష్పలత, మంగయ్య, రమేష్‌, బాలరాజు, మంగ్యానాయక్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T06:32:35+05:30 IST