‘ఉపాధి’ అక్రమాలపై ఫిర్యాదు చేశారని దాడి

ABN , First Publish Date - 2022-10-07T05:37:19+05:30 IST

చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై కలెక్టర్‌కు గ్రామస్థులు ఇటీవల ఫిర్యాదు చేశారు.

‘ఉపాధి’ అక్రమాలపై ఫిర్యాదు చేశారని దాడి
ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌

ఐదుగురికి గాయాలు 

చందంపేట, అక్టోబరు 6: చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై కలెక్టర్‌కు గ్రామస్థులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారిపై  కక్ష పెంచుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం రాత్రి వారిపై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అన్నెపాక హరికృష్ణ, అన్నెపాక శివకృష్ణ, పంది అనిల్‌, అన్నెపాక వెంకటయ్య ఇళ్లపై  దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలవడంతో వారు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మె ల్యే బాలునాయక్‌ వారిని పరామర్శించి దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై చందంపేట ఎస్‌ఐ యాదయ్యను వివరణ కోరగా పాత కక్షల కారణంగానే ఘర్షణ జరిగిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-10-07T05:37:19+05:30 IST