ప్రజాసంగ్రామ యాత్రపై దాడి సిగ్గుచేటు : కంకణాల

ABN , First Publish Date - 2022-08-16T06:55:07+05:30 IST

జన గాం జిల్లా దేవరుప్పలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు.

ప్రజాసంగ్రామ యాత్రపై దాడి సిగ్గుచేటు : కంకణాల
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీధర్‌రెడ్డి

చండూరు, ఆగస్టు 15: జన గాం జిల్లా దేవరుప్పలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతలే ల క్ష్యంగా పధకం ప్రకారం దాడి చే శారని తీవ్రంగా ఖండించారు. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తుంటే ఓర్వలేని అధికార పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తల పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని, ఆ దిశగా ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, చండూరు పట్టణ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి, దర్శనం వేణుకుమార్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపాటి సతీష్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సత్యం, అంజిబాబు, రఘుమారెడ్డి, శంకర్‌, మన్నెం ప్రవీణ్‌, ఇడికోజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2022-08-16T06:55:07+05:30 IST