బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం : సంకినేని
ABN , First Publish Date - 2022-10-07T05:46:52+05:30 IST
బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.
తుంగతుర్తి, అక్టోబరు 6: బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. మండలకేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పథకం ప్రకారమే బీజేపీ నాయకులపై దాడి చేస్తూ పూజారిని కూడా రానీయకుండా రామాలయం ఎదుట నాటిన జమ్మిచెట్టును తీసివేస్తూ ఆరాచక వాతావరణం సృష్టించారన్నారు. రాళ్లదాడిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబుతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం గడి, గ్రామ పంచాయతీ, దేవాలయం ఎదుట దసరా పూజలు చేశారని తెలిపారు. దానిని తోసిపుచ్చి కేవలం టీఆర్‌ఎస్ నాయకులు పూజలు చేసి అక్కడికి వస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్యన్నారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోవడంలేదని ఆరోపిం చారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గఇ న్‌చార్జి కడియం రామచంద్రయ్య, నాయకులు కాప రవికుమార్, మల్లెపాక సాయిబాబ, గాజుల మహేందర్, చిరంజీవి, రమేష్, సోమన్న పాల్గొన్నారు.