పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-17T06:30:05+05:30 IST

పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానీయా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన సూచించారు.

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సుల్తానీయా, దేవసేన

వీడియోకాన్ఫరెన్స్‌లో సందీప్‌ కుమార్‌ సుల్తానీయా


భువనగిరి రూరల్‌, మే16: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానీయా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన సూచించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించవద్దన్నారు. సీసీకెమెరాలతో నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అదే విధంగా పరీక్ష సమయంలో జీరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. కలెక్టర్‌ పమేలాసత్పథి మాట్లాడుతూ, ఈనెల 23 నుంచి నిర్వహించు న్న పదోతరగతి పరీక్షలకు జిల్లాలో 9,477మంది విద్యార్థులు హాజరవుతున్నార ని, అందుకు 60 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 3సిట్టింగ్‌ స్వ్కాడ్‌, 60మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 1266మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు వివరించారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్‌ సరఫరా, మంచినీటి వసతి, ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీపీవో సునంద, డీఈవో కె.నర్సింహ, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌రావు, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ రం గరాజన్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ బి.శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:30:05+05:30 IST