ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ మాపై లేదా?

ABN , First Publish Date - 2022-10-07T05:43:48+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ తమపై లేదని చర్లగూడెం భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ మాపై లేదా?
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న భూనిర్వాసితులు

మర్రిగూడ, అక్టోబరు 6: మునుగోడు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ తమపై లేదని చర్లగూడెం భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితులు చేస్తున్న దీక్ష గురువారం 36వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శివన్నగూడ, ఖుదాభక్ష్‌పల్లి, రాంరెడ్డిపల్లి, అజిలాపురం గ్రామాల రైతులు సైదులు, కొత్త లొంకయ్య, కారింగు జంగయ్య మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని 36 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికపై ఉన్న ప్రభుత్వానికి శ్రద్ధ నిర్వాసితులపై లేదన్నారు. ఉప ఎన్నికలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, తమకు అందించాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన 80మంది రైతులం దరికీ ఉపాధి లేక హైదరాబాద్‌కు వలసలు వెళ్తున్నామని, కుటుం బ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం స్పందించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని కోరారు.



Updated Date - 2022-10-07T05:43:48+05:30 IST