ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం : ముదిరెడ్డి

ABN , First Publish Date - 2022-12-30T00:41:04+05:30 IST

కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగ డతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధా కర్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం : ముదిరెడ్డి

నార్కట్‌పల్లి, డిసెంబరు 29: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగ డతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధా కర్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. నార్కట్‌పల్లిలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న దేశవ్యాప్తంగా 20లక్షల మందితో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం నాయకులు సయ్యద్‌ హాషం, నర్సిరెడ్డి, వైస్‌ ఎంపీపీ కల్లూరి యాదగిరి, శ్రీరామోజు వెంకటేశ్వర్లు, దండు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:41:04+05:30 IST

Read more