అంకిరెడ్డి ఆశయాలను సాధించాలి

ABN , First Publish Date - 2022-05-18T07:17:59+05:30 IST

అంకిరెడ్డి ఆశయాలు సాధించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. తన తండ్రి అంకిరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం కెనడాలోని ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంకిరెడ్డి ఆశయాలను సాధించాలి
అంకిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌ , మే 17: అంకిరెడ్డి ఆశయాలు సాధించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. తన తండ్రి అంకిరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం కెనడాలోని ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం అంకిరెడ్డి కృషి చేశారన్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, టౌన్‌హాల్‌లో అంకిరెడ్డి చిత్రపటా నికి టీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంకిరెడ్డి సేవలు మరువలేనివి మఠంపల్లి: గుండ్లపల్లి గ్రామంతో పాటు మఠంపల్లి మండల అభి వృద్ధికి శానంపూడి అంకిరెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేవని హుజూర్‌నగర్‌ మునిసి పల్‌ చైర్మన్‌ జక్కుల వీరయ్య అన్నారు. 

అంకిరెడ్డి సేవలు మరువలేనివి

మఠంపల్లి: గుండ్లపల్లి గ్రామంతో పాటు మఠంపల్లి మండల అభి వృద్ధికి శానంపూడి అంకిరెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేవని హుజూర్‌నగర్‌ మునిసి పల్‌ చైర్మన్‌ జక్కుల వీరయ్య అన్నారు. అంకిరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా మంగళ వారం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించి మాట్లాడారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ జగన్‌నాయక్‌, ఎంపీపీ ముడావత్‌ పార్వతికొండానా యక్‌, సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌, పఠాన్‌జాన్‌బీ, ఎంపీటీసీ గుండా వెంకటరమణబ్రహ్మారెడ్డి,  పార్టీ మండల అధ్యక్షుడు  పిచ్చయ్య, హపీజ్‌ఖాన్‌,  కృష్ణంరాజు, అశోక్‌ నాయక్‌, వెంకటనారాయణ, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.Read more