అదనంగా రూ.వెయ్యి ఇస్తానన్నారుగా.. ఏవి ?
ABN , First Publish Date - 2022-11-04T06:11:42+05:30 IST
‘ఊరికి దూరంగా ఉన్న మేము ఓటేయడానికి వస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్నారుగా.. ఆ డబ్బు ఎక్కడా ?’ నల్లగొండ జిల్లా నాంపల్లిలో
టీఆర్‌ఎస్ కార్యకర్తలను నిలదీసిన ఓటర్లు
‘ఊరికి దూరంగా ఉన్న మేము ఓటేయడానికి వస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్నారుగా.. ఆ డబ్బు ఎక్కడా ?’ నల్లగొండ జిల్లా నాంపల్లిలో కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు గురువారం ఎదురైన ప్రశ్న ఇది. వివిధ ప్రాంతాల నుంచి ఓటేయడానికి గ్రామానికి వచ్చిన ఓటర్లు వారిని ఇలా నిలదీశారు. లోకల్, నాన్‌లోకల్ అని నిందలు వేసి తమకు అదనంగా ఇస్తానన్న వెయ్యి ఇవ్వలేదని, కొందరికే ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు.