ఆమోదయోగ్యమైన రాజీనే ఉత్తమం

ABN , First Publish Date - 2022-06-27T07:01:14+05:30 IST

కక్షీదారులకు ఆమోదయోగ్యమైన రాజీనే ఉత్తమ పరిష్కారమని జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు అన్నారు.

ఆమోదయోగ్యమైన రాజీనే ఉత్తమం
భువనగిరి లోక్‌ అదాలత్‌తో మాట్లాడుతున్న జిల్లా న్యాయమూర్తి బాలభాస్కర్‌రావు

జిల్లా జడ్జి బాలభాస్కర్‌రావు

లోక్‌ అదాలత్‌లో 9,972 కేసుల పరిష్కారం

భువనగిరి టౌన్‌,జూన్‌ 26: కక్షీదారులకు ఆమోదయోగ్యమైన రాజీనే ఉత్తమ పరిష్కారమని జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు అన్నారు. భువనగిరి కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే కక్షిదారులకు సమయం ఆదా అవుతుందని, శత్రుత్వం తగ్గి స్నేహపూర్వక వాతావర ణం ఏర్పడుతుందన్నారు. అలాగే కోర్టుల్లో పెండింగ్‌ కేసులు తగ్గుతాయన్నారు. రెండు నెలలుగా జిల్లాలోని భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్‌, ఆలేరు పరిధిలోని 10కోర్టుల్లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లతో ఇప్పటి వరకు 9,972కేసులు పరిష్కారమయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మారుతీ దేవి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రజిని, జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత, ప్రత్యేక న్యాయమూర్తి జావిద్‌, డీసీపీ కె.నారాయణరెడ్డి, ఏసీపీ ఎస్‌.వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T07:01:14+05:30 IST