అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-08-04T05:45:51+05:30 IST

: అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తే సహించేది లేదని రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు హెచ్చరించారు.

అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తే సహించేది లేదు

రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు 

హుజూర్‌నగర్‌, ఆగస్టు 3: అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తే సహించేది లేదని రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 2006 అటవీ హక్కుల చట్టం సవరణ పేరుతో జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో పెట్టి చట్టాన్ని రద్దు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమైనవన్నారు. పోడు రైతులందరికీ హక్కుపత్రాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. పోడు రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకో వాలని, రైతులకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి డేవిడ్‌, కోరుకుంట్ల సైదయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-04T05:45:51+05:30 IST