ఆదర్శ గ్రామపంచాయతీగా ఆమనగల్లు
ABN , First Publish Date - 2022-04-28T06:02:46+05:30 IST
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలోని 19గ్రామాల్లో వేముల పల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం 16వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సర్పంచ్ వల్లంపట్ల ఝాన్సీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రాధా న్యత ఇవ్వడం
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశంలో 16వ స్థానం
వేములపల్లి, ఏప్రిల్ 27: సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలోని 19గ్రామాల్లో వేముల పల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం 16వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సర్పంచ్ వల్లంపట్ల ఝాన్సీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రాధా న్యత ఇవ్వడంతోపాటు మౌలిక వసతుల కల్పన, పల్లెప్రకృతి వనం కార్యక్రమాలతో పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు. దీంతోపాటు పల్లెల అభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీకి అవసరమైన నిధులు కేటా యించడంతో గ్రామా భివృద్ధికి నిరంతరం చేసిన కృషి ఫలితంగా దేశస్థాయిలో ఆమనగల్లు ఆదర్శ గ్రామపంచాయతీగా 89.17 స్కోరుతో 16వ స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం, వీధి దీపాలు, డంపింగ్ యార్డుకు చెత్త తరలించడం, సీసీరోడ్లు, వీధుల శుభ్రత, నర్సరీలో మొక్కల పెంపకంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారికి అందేలా కృషి చేసినట్లు సర్పంచ్ తెలిపారు.