ఆలేరు అభివృద్ధికి పునరంకితం

ABN , First Publish Date - 2022-08-17T06:29:21+05:30 IST

: ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

ఆలేరు అభివృద్ధికి పునరంకితం
గుట్టలో కేక్‌కట్‌ చేసి ప్రభుత్వ విప్‌ సునీతకు తినిపిస్తున్న భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి

ప్రజలు ఆదరించినందుకు వారి రుణం తీర్చుకుంటా 

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 16: ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సింహద్వారం ఎదుట వందలాది మంది టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానుల మధ్య బర్త్‌డే కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఆలేరు ప్రజలు తనను ఆదరించి రెండుసార్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక సేవలు అందించి రుణం తీర్చుకుంటానన్నారు. ఎనిమిదే ళ్ల కాలంలో కేసీఆర్‌ సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని సుమారు రూ.3వేలకోట్ల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ నూతన భవనాల నిర్మాణాలు, రైతువేదికలు, బీసీ, ఎస్సీ కమ్యూటీ భవనాలు, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, లింక్‌రోడ్లు నిర్మించామని తెలిపారు. ఎన్నో రోజుల నుంచి సాగు, తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు తీర్చానన్నారు.  యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట మెయిన్‌రోడ్డుపై నుంచి డప్పు చప్పుళ్లతో, బాణాసంచా కాల్చుతూ ర్యాలీ తీశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రా మాల్లో కార్యకర్థలు, నాయకులు విప్‌ సునీత జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆలేరు వ్యవసాయ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కసావు శ్రీనివా్‌సగౌడ్‌, మిట్ట వెంటకయ్యగౌడ్‌, జిల్లా నాయకుడు పల్లెపాటి బాలయ్య,  మారెడ్డి కొండల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, తోటకూరి అనురాధ, శ్రీధర్‌గౌడ్‌, శిఖ శ్రీనివా్‌సగౌడ్‌, పాపట్ల నరహరి, ముక్కెర్ల శ్రీశైలం, రేపాక స్వామి, మల్లారెడ్డి, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

గుట్టలో విప్‌ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతలాపన

భారతదేశ స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవాల్లో సింహద్వారం ఎదుట ప్రభు త్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 11.30గం టలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామానూజాచార్యులు, ఏసీపీ నర్సింహారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more