ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-12-15T00:24:45+05:30 IST

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు అక్టోబరు, నవంబరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంక టేశం డిమాండ్‌ చేశారు.

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి
నినాదాలు చేస్తున్న టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు

నల్లగొండ, డిసెంబరు 14 : ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు అక్టోబరు, నవంబరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంక టేశం డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లోని డీటీవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రెండునెలల నుంచి వేతనాలు లేక కనీస అవసరాలకు ఇబ్బందిగా ఉందని బ్యాంకుల్లో ఇంటి రుణాల చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు అపరాద రుసుము విధిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీ ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు బి. అరుణ, కార్యదర్శులు సీహెచ్‌. అరుణ, నలపరాజు వెంకన్న, గ్యార నర్సింహ, నర్ర శేఖర్‌రెడ్డి, మురళయ్య, నర్సింహమూర్తి, విజయలక్ష్మి, భద్రయ్య, రాజశేఖర్‌, లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, స్వరూపరాణి, లూయీస్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:24:47+05:30 IST