మాస్టర్‌ ప్లాన్‌పై సలహాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-02-16T06:50:44+05:30 IST

నల్లగొండ మునిసిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని ఉదాయాదిత్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మాస్టర్‌ప్లాన్‌ రెండో కన్సెల్టేటివ్‌ వర్క్‌షాపులో మాట్లాడారు. స్ర్టెమ్‌ అనే కన్సెల్టెన్సీ సంస్థ వివిధ శాఖలు, అన్ని పారామీటర్లను, ప్రసు ్తత పరిస్థితిని అనుసరించి జనాభా మౌలిక వసతులు, ఆర్థిక వనరులకు అనుగుణంగా వచ్చే 20 సంవత్సరాలను పరిగనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ ముసాయి

మాస్టర్‌ ప్లాన్‌పై సలహాలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీజే పాటిల్‌, పక్కన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

రామగిరి, ఫిబ్రవరి 15: నల్లగొండ మునిసిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని ఉదాయాదిత్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మాస్టర్‌ప్లాన్‌ రెండో కన్సెల్టేటివ్‌ వర్క్‌షాపులో మాట్లాడారు. స్ర్టెమ్‌ అనే కన్సెల్టెన్సీ సంస్థ వివిధ శాఖలు, అన్ని పారామీటర్లను, ప్రసు ్తత పరిస్థితిని అనుసరించి జనాభా మౌలిక వసతులు, ఆర్థిక వనరులకు అనుగుణంగా వచ్చే 20 సంవత్సరాలను పరిగనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా తయారు చేస్తుం దన్నారు. దీనిపై సలహాలు, సూచనలు రాతపూర్వకంగా ఇస్తే వాటిని పరిశీలించి ముసాయిదాలో చేర్చనున్నట్లు తెలిపారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడు తూ 1987 తర్వాత మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన కాకపోవడంతో మునిసిపాలిటి ఎంతో నష్టపోయిందన్నారు. 1987లో జనాభా ప్రకారమే ఇప్పటికి రోడ్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయన్నారు. వాటిలో మార్పు రావాల్సిన అవసరముందన్నారు. ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌లో నివాసిత, పారిశ్రామిక, వాణిజ్య, వాటర్‌ బాడీస్‌, వ్యవసాయ జోన్ల్‌గా భూభాగం లో వర్గీకరణ చేసినట్లు తెలిపారు. 2041 వరకు 20శాతం జనాభా పెరిగే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ముసాయిదా తయారు చేస్తారని తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ మండడి సైదిరెడ్డి మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పట్టణం ఎంతోఅభివృద్ధి చెందతుందని తెలిపారు. కౌన్సిలర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడు తూ పట్టణంలో నలు వైపులా డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేస్తే డిజిల్‌ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంనందున ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. 28వ వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల శ్రీనివాస్‌, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ బండారు ప్రసాద్‌ మాట్లాడుతూ గుండ్లపల్లి ఎక్స్‌ రోడ్‌ నుంచి మామిడ్లగూడెం వరకు 60ఫీట్ల రోడ్డు అయ్యేలా ముసాయిదాలో చేర్చాలని, మునుగోడు రోడ్డు వైపు అభివృద్ధి చేయాలని వారు సూచించారు. మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి మాట్లాడుతూ కొత్త ముసాయిదాను రెండు మూడు రోజుల్లో అందజేస్తామన్నారు. స్ట్రెమ్‌ కన్సెల్టెన్సీ సంస్థ ప్రతినిధి కుమార్‌ మాస్టర్‌ ప్లాన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, మునిసిపల్‌ శాఖ ఆర్‌డీ నర్సింహ్మ, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more