పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌కు ఆదరణ

ABN , First Publish Date - 2022-12-27T23:57:42+05:30 IST

రాష్ట్రంలో పోలీస్‌ విభాగాలు(పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌)కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.

పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌కు ఆదరణ
వీడియోకాన్ఫరెన్స్‌లో డీజీపీతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

వీడియో కాన్ఫరెన్సలో డీజీపీ మహేందర్‌రెడ్డి

సూర్యాపేటక్రైం, డిసెంబరు 27: రాష్ట్రంలో పోలీస్‌ విభాగాలు(పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌)కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేసుల స్థితిగతులు, ఇంటర్‌నెట్‌ వినియోగం, కమ్యూనిటీ కార్యక్రమాలు, మహిళా రక్షణ, సాంకేతిక, ఆధునిక పోలీసింగ్‌ అంశాలపై జిల్లాల ఎస్పీలతో డీజీపీ మంగళవారం వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో ఆయన సమీక్ష చేశారు. పోలీస్‌ స్టేషన్లలోని అన్నివిభాగాల నిర్వహణలో రాష్ట్రంలో కోదాడ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ ఉత్తమ పోలీ్‌సస్టేషన్‌గా నిలిచిందన్నారు. పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌లో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ అభినందించారు. అనంతరం ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కోదాడ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ ఉత్తమ పీఎ్‌సగా, పోలీస్‌ ఫంక్షనల్‌ వర్టికల్‌గా జిల్లా మొదటి స్థానం నిలవడంలో సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించడమే ముఖ్యకారణమన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వేగంగా స్పందిస్తూ పనివిభాగాలను సమర్ధంగా అమలు చేస్తున్నామన్నారు. పనిలో నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీడియోకాన్ఫరెన్సలో డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి, స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సీఐలు శివశంకర్‌, పీఎన్‌డీ ప్రసాద్‌, రామలింగారెడ్డి, రాజశేఖర్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీకాంత్‌, ఐటీ కోర్‌ ఎస్‌ఐలు రవీందర్‌, సత్యనారాయణ, హరికృష్ణ, మహేందర్‌, వెంకయ్య, అంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T23:57:45+05:30 IST