జంతు సంరక్షణ చట్టాలఅమలుకు చర్యలు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-04T05:57:53+05:30 IST

జంతు సంరక్షణ చట్టాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ ఆయన చాంబర్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మానవులతోపాటు జీవించే జంతువులను హింసించకుండా, వాటి సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు.

జంతు సంరక్షణ చట్టాలఅమలుకు చర్యలు: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌శర్మ

 కలెక్టర్‌ రాహుల్‌శర్మ


నల్లగొండ టౌన్‌, ఆగస్టు 3: జంతు సంరక్షణ చట్టాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ ఆయన చాంబర్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మానవులతోపాటు జీవించే జంతువులను హింసించకుండా, వాటి సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు.  జంతువులపై దయ, కరుణతో ఉండేందుకు విద్యార్థుల్లో అవగాహన కలిగించాలన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు. జంతువులను వాహనాల్లో రవాణా చేసేటప్పుడు గాయాలుకాకుండా జగ్రత్తలు పాటించాలన్నారు. వాహనాల్లో ఆరు జంతువులకంటే ఎక్కువ రవాణా చేయవద్దని, రవాణా అధికారి విధిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆవులు, దూడలు, గేదెలను వదించుట నిషేధమన్నారు. సమావేశంలో పశుసంవర్ధక అధికారి డా. శ్రీనివాస్‌, డీపీవో విష్ణువర్ధన్‌, డీఈవో భిక్షపతి, డీపీఆర్‌వో శ్రీనివాస్‌, రవాణాశాఖ అధికారి సురే్‌షరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

పభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి

నల్లగొండ రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలను సత్వరమే అందించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. పట్టణంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకందించే పథకాలు ప్రజలకు అందించే విధంగా బ్యాంక్‌లు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం బ్యాంక్‌ ప్రతినిధులకు బయోమెట్రిక్‌ యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శర్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:57:53+05:30 IST