ఇల్లు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-07T07:02:44+05:30 IST

పక్కన చేపడుతున్న ఇంటి నిర్మాణం వల్ల త మ ఇల్లు ధ్వంసమైందని, బాగు చేయిస్తానని హామీ ఇచ్చి మరమ్మతు లు చేయించడం లేదని ఓ వృద్ధ జంట కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చే పట్టారు.

ఇల్లు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్‌ గేటు వద్ద ఫ్లెక్సీతో ఆందోళన చేస్తున్న వృద్ధ దంపతులు

నల్లగొండ, జూన 6: పక్కన చేపడుతున్న ఇంటి నిర్మాణం వల్ల త మ ఇల్లు ధ్వంసమైందని, బాగు చేయిస్తానని హామీ ఇచ్చి మరమ్మతు లు చేయించడం లేదని ఓ వృద్ధ జంట కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చే పట్టారు. నకిరేకల్‌ పట్టణానికి చెందిన ఉప్పల బాలనర్సయ్య, మంగమ్మ భార్యాభర్తలు. నకిరేకల్‌ మార్కెట్‌ రోడ్డులో వీరికి ఓ ఇల్లు ఉంది.  ఇంటి పక్కనే కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్న వారి వల్ల ఇల్లు ధ్వంసమైంది. దీంతో వారు 2021 డిసెంబరు 17వ తేదీన నకిరేకల్‌ పో లీస్‌స్టేషనలో తమ ఇంటి ధ్వంసంతో పాటు తమకు ప్రాణభయం ఉం దని ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు పోలీసులను కలిసినా పట్టించుకోలేద ని వాపోయారు. దీంతో వారు సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్షకు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయడంతో పాటు తమ ప్రాణాలను కాపాడాలని వారు అధికారులను వేడుకున్నారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 


Updated Date - 2022-06-07T07:02:44+05:30 IST