అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-26T06:43:17+05:30 IST

నల్లగొండ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

నల్లగొండ టౌన్‌, జూన్‌ 25: నల్లగొండ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు. శనివారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చర్లపల్లి లో అర్బన్‌ పార్కు పనులు పరిశీలించి ట్రీప్లాంటేషన్‌ను పరిశీలించారు. పార్కు ఎంట్రెన్స్‌ గేటు వద్ద కొనసాగుతు న్న పనులు, డ్రైనేజీ పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీర్లు, ఏజెన్సీ నిర్వాహకులను కోరారు. మర్రిగూడ బైపాస్‌ వద్ద జంక్షన్‌ పనులను పరిశీలించి మొక్కలను ఇంకా ఎక్కువ మొత్తంలో నాటాలన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల పక్కన కెనాల్‌ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసే సుందరీకరణ గురించి మునిసిపల్‌ కమిషనర్‌, ఏజె న్సీ వారితో కలెక్టర్‌ చర్చించారు. బీట్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేస్తున్న వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులను పరిశీలించి మార్బుల్‌ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పనులను త్వరగా పూర్తి చేయడానికి, రెండు షిఫ్టుల్లో పనులు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దేవరకొండ రోడ్డులో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి సంబంధిత ఇంజనీర్లతో చర్చించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెవి. రమణాచారి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 


బహిరంగ వేలానికి నేడు చివరి రోజు

శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాల వేలం ప్రక్రియకు నేడు చివరి తేదీ అని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో శ్రీవల్లి టౌన్‌షి్‌ప రెండో విడత భౌతిక వేలంలో భాగంగా ఆరో రోజు ఓపెన్‌ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే అన్ని అనుమతులతో అభివృద్ధి చేసిన వెంచర్లలో మౌలిక సౌకర్యాలు వెంటనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశమని, ఆసక్తిగల వారు వేలంలో పాల్గొని తమకు నచ్చిన ప్లాట్లు, ఇళ్లను సొంత చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు బహిరంగ వేలం ద్వారా రూ.4కోట్ల81లక్షల24వేలు ఆదాయం ప్రభుత్వానికి రానున్నట్లు తెలిపారు. వేలంపాటలో సర్వే లాండ్‌ రికార్డ్‌ ఏడీ ఎం.శ్రీనివాసులు, సీపీవో బాలశౌరి, డీపీవో విష్ణువర్థన్‌రెడ్డి, రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు మేనేజర్‌ షఫీయొద్దీన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T06:43:17+05:30 IST