ఏడాది క్రితం తల్లి .. నేడు తండ్రి మృతి

ABN , First Publish Date - 2022-09-10T06:33:47+05:30 IST

ఏడాది క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి చెంద డంతో ఆ దంపతుల ఇద్దరు చిన్నారులు ఒంటరి అయ్యారు.

ఏడాది క్రితం తల్లి .. నేడు తండ్రి మృతి
కరుణాకర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న చిన్నారులు, గ్రామస్థులు

 ఒంటరైన చిన్నారులు 

నాగులపాటిఅన్నారం గ్రామంలో  ఘటన

పెన్‌పహాడ్‌, సెప్టెంబరు 9: ఏడాది క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి చెంద డంతో ఆ దంపతుల ఇద్దరు చిన్నారులు ఒంటరి అయ్యారు. ఈ ఘటన  మండ లంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అనంతుల కరుణాకర్‌ (30) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య దీపిక ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ దంపతులకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న సుష్మిత, ఆరేళ్ల వయసు ఉన్న  లిఖిత ఉన్నారు. ఈ కుటుంబానికి భూమి లేదు. చిన్న గుడిసె ఉంది. తల్లి మృతి చెందినప్పటి నుంచి కుమార్తెలను తండ్రే సంరక్షిస్తున్నాడు. తండ్రి కరుణాకర్‌ కూడా మృతి చెందటంతో ఆయన మృతదేహంపై పడి చిన్నారులు విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. బంధుమిత్రులు చందాలు వేసుకుని కరుణాకర్‌ దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఒంటరైన చిన్నారుల సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. చిన్నారుల సంరక్షణ చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Read more