ఘనంగా విప్‌ సునీత పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-08-17T05:54:21+05:30 IST

ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా విప్‌ సునీత పుట్టినరోజు వేడుకలు
తుర్కపల్లిలో సునీత పుట్టినరోజు వేడుకలు

తుర్కపల్లి, ఆగస్టు 16: ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి కేక్‌ కట్‌చేసి పంపిణీ చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో భారీ బాణా సంచా కాల్చారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నెపురెడ్డి నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన ధానావతు బీకునాయక్‌, ఎంపీపీ భూక్య సుశీల, పీఎసీఏస్‌ చైర్మన సింగిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, శాగర్ల పరమేశ, మాజీ ఎంపీపీ గజం ఉప్పలయ్య, పోగుల ఆంజనేయులు, సుంకరి శెట్టయ్య, కల్లూరి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

రాజాపేట: ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను రాజాపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బర్త్‌డే కేక్‌ను కట్‌ చేసి పంపిణీ చేశారు. విప్‌ సునీతను శాలువాలతో నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

బొమ్మలరామారం: విప్‌ సునీతమహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని రంగాపూర్‌లో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. అంతకు ముందు మండల కేంద్రం నుంచి రంగాపూర్‌ సూర్య ఫంక్షనహాల్‌ వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన ఏనుగు కొండల్‌రెడ్డి, గుర్రాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేయగా కార్యక్రమంలో  పార్టీ మండల పోలగౌని వెంకటేశగౌడ్‌, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, భువనగిరి ఎఎంసీ వైస్‌ చైర్మన కుశంగల సత్యనారాయణ, పీఎసీఏస్‌ చైర్మన బాల్‌నర్సింహ, వైస్‌ ఎంపీపీ గొడుగు శోభచంద్రమౌళి, నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, రాజ్‌కుమార్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

గుండాల: ఎమ్మెల్యే సునీతమహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.  వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ.ఖలీల్‌, వైస్‌ ఎంపీపీ మహేందర్‌రెడ్డి మాజీ మార్కెట్‌ చైర్మన మందడి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సంగి వేణు, బండ రమేష్‌రెడ్డి, ఇమ్మడి దశరథ, మూగల శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

మోటకొండూరు: విప్‌ గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేక్‌ కట్‌చేసి ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, దూదిపాల రవీందర్‌రెడ్డి, పన్నాల అంజిరెడ్డి, ఎగ్గిడి కృష్ణ, ఇల్లెందుల మల్లేశ, జంగారెడ్డి, భూమాండ్ల సుదీర్‌ పాల్గొన్నారు. 

Read more