గ్రామంలో 20పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T05:37:20+05:30 IST

మేళ్లచెర్వులో 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు కోరారు. మేళ్లచెర్వు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభను శుక్ర వారం నిర్వహించారు.

గ్రామంలో 20పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
మేళ్లచెర్వులో గ్రామసభలో పాల్గొన్న నాయకులు

మేళ్లచెర్వు, అక్టోబరు 7: మేళ్లచెర్వులో 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు కోరారు. మేళ్లచెర్వు  గ్రామ పంచాయతీ కార్యాలయంలో  సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభను శుక్ర వారం  నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి వేళల్లో వీధిదీపాలు పూర్తిగా వెలగనందున ఆకతాయిల ఆగడాలు పెరిగాయని, వీధి దీపాలకు మరమ్మతు చేయించా లని, అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, పాడుబడిన బావులకు మరమ్మతు చేయించి.. చుట్టూ ఫెన్సింగ్‌ వేయించాలని, మండలం లోని ప్రభుత్వ అధికారులు స్థానికంగా నివసించేలా చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసు  కు వెళ్లి పరిష్కరిస్తామని గ్రామ కార్యదర్శి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read more