Modi Telangana Tour: తెలంగాణలో మోదీ పర్యటన ఇలా..

ABN , First Publish Date - 2022-11-10T20:03:52+05:30 IST

ప్రధాని మోదీ (Prime Minister Modi) తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు.

Modi Telangana Tour: తెలంగాణలో మోదీ పర్యటన ఇలా..

హైదరాబాద్: ప్రధాని మోదీ (Prime Minister Modi) తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport)లో మోదీకి స్వాగత సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం బేగంపేట నుంచి రామగుండానికి ప్రధాని పయనమవుతారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండం (Ramagundam)లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారని తెలిపింది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని పేర్కొంది. రూ.2,200 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి 765డీజీపై మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌, ఎన్‌హెచ్‌-161బీబీపై బోధన్‌-బాసర-భైంసా సెక్షన్‌, ఎన్‌హెచ్‌-353సీపై సిరొంచా-మహదేవ్‌పూర్‌ సెక్షన్‌ రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంఓ పేర్కొంది.

తెలంగాణలో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే...

శనివారం మ.12.25 గం.కు విశాఖ నుంచి బయల్దేరనున్న మోదీ

మ.1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ

మ.1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్ పోర్టులో స్వాగత సభ

మ.2.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రామగుండానికి ప్రధాని

3.30 నుంచి 4 గంటల వరకు రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శన

సా.4.15 నుంచి 5.15 గంటల వరకు బహిరంగ సభ

సా.5.30 గంటలకు రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం

6.40 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి పయనం

Updated Date - 2022-11-10T20:03:53+05:30 IST