మంగల్‌పేటలో ఘనంగా కుస్తీపోటీలు

ABN , First Publish Date - 2022-04-05T05:45:45+05:30 IST

ఉగాది సందర్భంగా మత్తడి పోచమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.

మంగల్‌పేటలో ఘనంగా కుస్తీపోటీలు
పోటీలో తలపడుతున్న మల్లయోధులు

నారాయణఖేడ్‌ ఏప్రిల్‌ 4: ఉగాది సందర్భంగా మత్తడి పోచమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని నారాయణఖేడ్‌ జంట గ్రామమైన మంగల్‌పేటలో సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. స్థానిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ పోటీలను వీక్షించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్ఛారు.  కుస్తీ పోటీల్లో  కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు నారాయణఖేడ్‌ పరిసర గ్రామాలకు చెందిన మల్లయోధులు పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ పోటీలను పురస్కరించుకొని నిర్వాహకులు మల్లయోధుల స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.500ల వరకు ప్రోత్సాహకాలతో పోటీ లు నిర్వహించారు. ఫైనల్‌ పోటీలో 5 తులాల వెండి కడియాన్ని విజేతలకు అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. మత్తడి పోచమ్మ జాతర సందర్భంగా  కొన్నిదశాబ్దాలుగా ఈ పోటీలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  ఈ పోటీలను వీక్షించడానికి చిన్నా, పెద్ద భేదం లేకుండా భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

 

Read more