మూడురోజుల పాటు మహిళా దినోత్సవాలు

ABN , First Publish Date - 2022-03-06T05:04:49+05:30 IST

ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ పిలుపు, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట పట్టణంలో మూడురోజుల పాటు మహిళా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు, మహిళా నాయకులు బూర విజయ, టైగర్‌ నర్సమ్మ తెలిపారు.

మూడురోజుల పాటు మహిళా దినోత్సవాలు
మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ మంజుల

సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు

సిద్దిపేట టౌన్‌/గజ్వేల్‌/చేర్యాల, మార్చి 5 : ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ పిలుపు, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట పట్టణంలో మూడురోజుల పాటు మహిళా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు, మహిళా నాయకులు బూర విజయ, టైగర్‌ నర్సమ్మ తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలోని మల్టీపర్పస్‌ హైస్కూల్‌ (బాలుర పాఠశాలలో) ఆదివారం నుంచి మంగళవారం వరకు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళా కౌన్సిలర్లు కొండం కవిత, ఉదర జయ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సన్మానం చేయనున్నామని తెలిపారు. ఆయనవెంట గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణ, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం ఉన్నారు. నేటి నుంచి మూడురోజుల పాటు చేర్యాల మండలంలో నిర్వహించే మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ తాడెం రంజిత కృష్ణమూర్తి అన్నారు. శనివారం ఆమె చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. 

Read more