చలి పంజా

ABN , First Publish Date - 2022-11-20T23:55:16+05:30 IST

జిల్లాలో రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి గుప్పిట్లో ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం జిల్లాలో అత్యల్పంగా పాపన్నపేట మండల పరిధిలోని లింగాయిపల్లిలో 9 డిడ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలి పంజా

మెదక్‌ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అత్యల్పంగా లింగాయిపల్లిలో 9 డిగ్రీలు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 20: జిల్లాలో రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి గుప్పిట్లో ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం జిల్లాలో అత్యల్పంగా పాపన్నపేట మండల పరిధిలోని లింగాయిపల్లిలో 9 డిడ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోడగట్టులో 9.3, కౌడిపల్లి, భుజరంపేటలో 9.4, వాడిలో 9.6, శివనూర్‌, కొల్చారంలో 9.8, కొత్తపేటలో 9.8, శివ్వంపేటలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో ఉమ్మడి జిల్లాలోనే ఈ సీజన్‌లో అత్యల్పంగా 7.5 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల ప్రారంభంలో మొదలైన చలి ప్రభావం రెండోవారంలో సాధారణ స్థితికి చేరుకున్నది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం 5 గంటలకే చలి మొదలవుతున్నది. రాత్రి ఏడు గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి మరీ ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున మంచు కురియడంతోపాలు చలి గాలులు వీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురవడంతో చలి ప్రభావం ఎక్కువే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-11-20T23:55:16+05:30 IST

Read more