క్రీడా పరికరాలు లేని మైదానాలు ఎందుకు?

ABN , First Publish Date - 2022-11-23T23:57:52+05:30 IST

గ్రామాల్లో బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడా మైదానాలు

క్రీడా పరికరాలు లేని మైదానాలు ఎందుకు?
పిచ్చిమొక్కలతో నిండిన కొండాపూర్‌ క్రీడా మైదానం

నారాయణఖేడ్‌, నవంబరు 23: గ్రామాల్లోని విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. నారాయణఖేడ్‌ మండలంలో 71 క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే తెలంగాణ క్రీడా ప్రాంగణం అని బోర్డులు పెట్టారే తప్ప క్రీడా పరికరాలను ఏర్పాటు చేయలేదు. క్రీడాప్రాంగాణాలు ఏర్పాటు చేసిన స్థలంలో భూమిని కూడా చదును చేయలేదు. దీంతో క్రీడా మైదానాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. కొన్ని చోట్ల ఒకటి, రెండు క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం మంచి ఆశయంతో గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తే ఆచరణలో అమలు కావడం లేదు. ఈ విషయమై ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా.. మండలంలో స్థలం అనువుగా ఉన్న చోట అన్ని వసతులు కల్పిస్తున్నామని, స్థలం తక్కువగా ఉన్న చోట ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ అన్ని క్రీడా ప్రాంగాణాల్లో మొరం వేయించి భూమిని చదును చేయిస్తామన్నారు. ఇప్పటి వరకు క్రీడా ప్రాంగాణాలకు సంబంధించి ఎవ్వరికి బిల్లులు చెల్లించలేదని, పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2022-11-23T23:57:52+05:30 IST

Read more