సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-03T04:51:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి, అక్టోబరు 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని రేగులపల్లి, చిలపూర్‌పల్లె, కల్లెపల్లి, గూడెం గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అలాగే చీలపూర్‌పల్లిలో దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Read more