వరిలో తడి, పొడి విధానంతో నీరు ఆదా

ABN , First Publish Date - 2022-10-18T05:14:08+05:30 IST

వరి పంట సాగులో తడి, పొడి విధానం ద్వారా నీరు ఆదా అవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

వరిలో తడి, పొడి విధానంతో నీరు ఆదా
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు, అక్టోబరు 17: వరి పంట సాగులో తడి, పొడి విధానం ద్వారా నీరు ఆదా అవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరు రైతు వేదికలో ఐఎ్‌సడబ్ల్యూఏఆర్‌ ఆధ్వర్యంలో నీటి నిర్వహణ ద్వారా స్థిరమైన వరిసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు వరి సాగులో నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. వరితో పాటు ఆయిల్‌పామ్‌, మల్బరీ తోటలను సాగు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐఎ్‌సడబ్ల్యూఏఆర్‌ ప్రతినిధులు వరి పంటకు తడి, పొడి విధానం ద్వారా నీటిని అందించే పద్ధతులను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకరాజు, సర్పంచ్‌ ఉమే్‌షచంద్ర, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, శారదారమేష్‌, ఏవో జయంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:14:08+05:30 IST