విధులను బహిష్కరించిన వీఆర్‌ఏలు
ABN , First Publish Date - 2022-12-16T23:53:47+05:30 IST
వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపణ
టేక్మాల్, డిసెంబరు 16: జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా తమతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వ అధికారుల వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం మండల కేంద్రమైన టేక్మాల్‌లో వీఆర్‌ఏలు ఒక రోజు విధులను బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడుతూ.. అధికారుల సూచన మేరకు గత రాత్రి కామారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఆండ్‌బీ కార్యాలయంలో పనిచేసి, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై వీఆర్‌ఏ నరేందర్ మృతిచెందాడని ఆరోపించారు. అతడి మరణానికి అధికారులే కారణమని.. ఇకపై ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.