మంత్రిని కలిసిన వీరశైవ లింగాయత్‌ నాయకులు

ABN , First Publish Date - 2022-10-04T05:14:13+05:30 IST

మంత్రి హరీశ్‌రావును వీరశైవ లింగాయత్‌ సమాజం నాయకులు కలిశారు.

మంత్రిని కలిసిన వీరశైవ లింగాయత్‌ నాయకులు
మంత్రి హరీశ్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాయకులు

పుల్‌కల్‌, అక్టోబరు 3: మంత్రి హరీశ్‌రావును వీరశైవ లింగాయత్‌ సమాజం నాయకులు కలిశారు. వీరశైవ లింగాయత్‌లకు హైదరాబాద్‌ నగర శివారులో గల కోకాపేట్‌లో బసవ భవన్‌ నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించినందుకు సోమవారం ఆయనను కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు. వీరశైవ లింగాయత్‌ సమాజం జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్‌ అధ్వర్యంలో పెద్దారెడ్డిపేట సంతో్‌షకుమార్‌, పల్వట్ల జగదీశ్వర్‌, సిద్దేశ్వర్‌, జయప్రకాశ్‌, నర్సింహులు, మల్లికార్జున్‌, శివరాజ్‌ మంత్రిని కలిశారు. రూ.10 కోట్లతో ఎకరం స్థలంలో బసవ భవన్‌ నిర్మాణానికి నిధులు, స్థలం కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Read more