బ్యాంకు రుణాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-03-06T05:13:08+05:30 IST

బ్యాంకు రుణాలను వినియోగించుకోవాలని లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ వెణుగోపాల్‌రావు పేర్కొన్నారు.

బ్యాంకు రుణాలను వినియోగించుకోవాలి

చిన్నశంకరంపేట, మార్చి 5: బ్యాంకు రుణాలను వినియోగించుకోవాలని లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ వెణుగోపాల్‌రావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్‌బీఐ ప్రాజెక్టులో భాగంగా పేస్‌ స్వచ్ఛంద సంస్థ, ఎస్‌బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ఐకేపీ కార్యాలయంలోని చిన్నశంకరంపేట, చేగుంట, నార్సిం గి మండలాల డ్వాక్రా మహిళా సంఘాల అధ్యక్షురాలు, సర్పంచులు, ఖాతా దారులకు అక్షరాస్యత, ఆర్థికాభివృద్ది, రుణాలఫై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రుణాలు ఏవిదంగా పొందాలి అనే అంశంపై పలు సూచనలు కల్పించారు. ఇన్యూరెన్సుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జాన్‌ కెనడీ, ఎంపీడీవో గణే్‌షరెడ్డి, బ్యాంకు మేజర్లు, ఐకేపీ ఏపీఎంలు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:13:08+05:30 IST