గుమ్మడిదలలో మూత్రశాలలు లేక ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-09-10T05:58:18+05:30 IST

గుమ్మడిదలలో మండల కేంద్రంలో మూత్రశాలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుమ్మడిదలలో మూత్రశాలలు లేక ఇబ్బందులు
గుమ్మడిదల మండల కేంద్రం

గుమ్మడిదల, సెప్టెంబరు 9: గుమ్మడిదలలో మండల కేంద్రంలో మూత్రశాలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల నిమిత్తం  గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది ప్రజలు, ప్రయాణికులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు వివిధ గ్రామాల నుంచి గుమ్మడిదల మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. కాగా మండల కేంద్రంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో మూత్రశాలలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. పంచాయతీ నిధుల నుంచి నిర్మించాల్సి ఉన్నా, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Read more