షీటీంపై అవగాహన

ABN , First Publish Date - 2022-10-18T04:35:54+05:30 IST

బాలికలు, యువతులు, మహిళలు, విద్యార్థినులు షిటీంపై అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ బాలాజీ అన్నారు.

షీటీంపై అవగాహన

నారాయణఖేడ్‌, అక్టోబరు 17: బాలికలు, యువతులు, మహిళలు, విద్యార్థినులు షిటీంపై అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ బాలాజీ అన్నారు. సోమవారం నిజాంపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి షీటీం ఎస్‌ఐ మొగులయ్య ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈవ్‌టీజింగ్‌లో భాగంగా బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే కఠి చర్యలు తప్పవంటూ షీటీంకు సంబందించి సమగ్రంగా వివరించారు.

Updated Date - 2022-10-18T04:35:54+05:30 IST