అండర్‌-16, 19 జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు

ABN , First Publish Date - 2022-07-04T05:18:52+05:30 IST

అండర్‌-16, 19 జిల్లా క్రికెట్‌ క్రీడకారుల జట్టును గజ్వేల్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఎంపిక చేసినట్లు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇన్‌చార్జి హరిశ్చంద్రప్రసాద్‌ ఆదివారం తెలిపారు.

అండర్‌-16, 19 జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు

గజ్వేల్‌ రూరల్‌, జూలై 3: అండర్‌-16, 19 జిల్లా క్రికెట్‌ క్రీడకారుల జట్టును గజ్వేల్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఎంపిక చేసినట్లు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇన్‌చార్జి హరిశ్చంద్రప్రసాద్‌ ఆదివారం తెలిపారు. జిల్లా నుంచి సుమారు 64 మంది హాజరుకాగా, రెండు జట్లకు అండర్‌-16లో 16 మంది, అండర్‌-19లో 16 మంది క్రీడాకారులను జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈనెల 15 నుంచి గజ్వేల్‌ ఐవోసీ పక్కన ఉన్న క్రీడా స్థలంలో జరిగే అంతర జిల్లా జట్లతో పోటీ పడతారని చెప్పారు. ఇందులో గెలుపొందిన జట్లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతాయని తెలిపారు. 

Read more