సంగారెడ్డిలో ఇద్దరు గంజాయి విక్రేతల రిమాండ్‌

ABN , First Publish Date - 2022-02-20T04:14:36+05:30 IST

సంగారెడ్డిలో శనివారం ఉదయం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంగారెడ్డిలో ఇద్దరు గంజాయి విక్రేతల రిమాండ్‌

సంగారెడ్డిరూరల్‌, ఫిబ్రవరి 19: సంగారెడ్డిలో శనివారం ఉదయం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  ఎక్సైజ్‌ సీఐ మధుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పొలకంపల్లి గ్రామంలోని తెర్లపురం మల్లన్న అనే వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారమందింది. అతడి పొలంలో గాలించగా సుమారు 520 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అదే విధంగా సదాశివపేటకు చెందిన సంపత్‌కుమార్‌ బిట్ల సంగారెడ్డిలోని గణే్‌షనగర్‌లో నివాసముంటూ గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతడి నివాసంలో తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను స్థానిక తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేసినట్టు ఎకైజ్‌ సీఐ వివరించారు.  

Read more