అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన
ABN , First Publish Date - 2022-03-06T05:10:58+05:30 IST
అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన అందిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
సంగారెడ్డి రూరల్, మార్చి 5: అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన అందిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలంలోని నాగాపూర్, ఇరిగిపల్లి, కల్పగూర్, కులబ్‌గూర్, ఫసల్‌వాది, గౌడిచర్ల, హనుమాన్‌నగర్ గ్రామాల్లో శనివారం ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో సీసీ రోడ్లకు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.8.40 కోట్ల నిధులను విడుదల చేశారని పేర్కొన్నారు. కల్పగూర్‌లోని కాశీవిశ్వేరాలయం, నందికందిలోని ఆలయం, కొండాపూర్‌లోని మ్యూజియానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నదని, ఆయా ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో మాట్లాడి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్, సర్పంచులు పాల్గొన్నారు. గామైక్య సంఘాల సభ్యులు వడ్డీ రూపంలో చెల్లించిన డబ్బును తిరిగి వారి ఖాతాలో వేసినందుకు కృతజ్ఞతలుగా హనుమాన్‌నగర్‌లో ఎంపీ సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.