బెదిరిన ఆవు.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-03-06T04:57:18+05:30 IST

మండలకేంద్రంలోని భవానీ మందిరం వద్ద ఓ ఆవు అకస్మాత్తుగా బెదిరిపోవడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

బెదిరిన ఆవు.. ఇద్దరికి గాయాలు

పెద్ద శంకరంపేట మార్చి 5: మండలకేంద్రంలోని భవానీ మందిరం వద్ద  ఓ ఆవు అకస్మాత్తుగా బెదిరిపోవడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం రోడ్డుపై వెళ్తున్న ఆవు ఒక్కసారిగా బెదిరిపోయి మహిళపైకి దూసుకు వెళ్లింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆమెను రక్షించేందుకు యత్నించగా అతడిపైకి కూడా దూసుకెళ్లడంతో ఇరువురికి గాయాలయ్యాయి.

Read more