దొంగ అరెస్టు.. భారీగా చోరీ సొత్తు స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-06T04:57:10+05:30 IST

తూప్రాన్‌, మనోహరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన నాలుగు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి శనివారం పోలీసులకు పట్టుబ డ్డాడు.

దొంగ అరెస్టు.. భారీగా చోరీ సొత్తు స్వాధీనం
వివరాలను వెల్లడిస్తున్న తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌

తూప్రాన్‌, మార్చి 5: తూప్రాన్‌, మనోహరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన నాలుగు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి శనివారం పోలీసులకు పట్టుబ డ్డాడు. నిందితుడి నుంచి రూ. 1.35 లక్షల నగదు, 14 తులాల బంగారం, 33తులాల వెండి రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి తూప్రాన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ మీడియాకు వివరాలను వెల్లడించారు. తూప్రాన్‌ పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద శనివారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా తూప్రాన్‌ పట్టణానికి చెందిన సింగన్నగారి వేణు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు దొంగతనాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. కాగా నిందితుడు వేణు గతంలో మేడ్చల్‌, పాపన్నపేట, వనస్థలిపురం, గజ్వేల్‌, గౌరారం పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీఎస్పీ వివరించారు. 

Updated Date - 2022-03-06T04:57:10+05:30 IST