ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-18T05:14:44+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండపోచమ్మ ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని ఆలయ చైర్మన్‌ జంబుల శ్రీనివాస్‌ రెడ్డి దుకాణ యజమానులకు సూచించారు.

ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

ఆలయ చైర్మన్‌ జంబుల శ్రీనివాస్‌రెడ్డి

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండపోచమ్మ ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని ఆలయ చైర్మన్‌ జంబుల శ్రీనివాస్‌ రెడ్డి దుకాణ యజమానులకు సూచించారు. సోమవారం మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ సమీపంలోని కొండపోచమ్మ ఆలయ పాలకమండలి సమావేశం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రజితారమేష్‌, ఈవో మోహన్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు కనకరెడ్డి, ఆర్కే శ్రీనివాస్‌, జానకీరాములు, కనకయ్య, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:14:44+05:30 IST