వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-09-28T05:02:34+05:30 IST

కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి కొనియాడారు.

వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి

ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి

గజ్వేల్‌/చేర్యాల/దౌల్తాబాద్‌, సెప్టెంబరు 27: కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి కొనియాడారు. గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశావర్కర్లకు ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివా్‌సతో కలిసి చీరలను పంపిణీ చేశారు. వారితో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్‌, వైద్యాధికారి ప్రతిభ ఉన్నారు. చేర్యాల మండలం ముస్త్యాల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశావర్కర్లకు ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి యూనిఫాం చీరలను పంపిణీ చేశారు. అలాగే చేర్యాల మునిసిపల్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆశావర్కర్లకు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి అందజేశారు. దౌల్తాబాద్‌ ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తున్న ఆశావర్కర్లకు ఎంపీపీ గంగాధరి సంధ్య యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సుభాషిణి, ఉపసర్పంచ్‌ యాదగిరి, సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, గీత, భవాని, స్టాఫ్‌నర్సులు సుమిత్ర, కవిత పాల్గొన్నారు.

Read more