వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-09-11T04:35:42+05:30 IST

వ్యవసాయ రంగంలో రైతులు అభివృద్ధి చెందుటకు వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలకమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ పేర్కొన్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలకం
వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 10: వ్యవసాయ రంగంలో  రైతులు అభివృద్ధి చెందుటకు వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలకమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక టీఎన్జీవోభవన్‌లో నిర్వహించిన ఏఈవోల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాలానికి అనుగుణంగా ఏ సమయంలో ఎలాంటి పంటలు వేయాలో.. రైతులకు విలువైన సూచనలు ఇస్తూ  వారి అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఏఈవోల జిల్లా నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో కార్యదర్శి రాజ్‌కుమార్‌ ప్రకటించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశోక్‌రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌, కోశాధికారి మాజీద్‌అలీ, సహ అధ్యక్షులు సునీల్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా గణేష్‌, జనార్దన్‌, వినీతభవానీ, ప్రచార కార్యదర్శి రాజశేఖర్‌గౌడ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి శేఖర్‌, సభ్యులుగా నవీన్‌, ఉత్తమ్‌, సింధు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఏఈవోల రాష్ట్ర సభ్యుడు ప్రవీణ్‌ వ్యవహరించారు.   

Read more