గజ్వేల్‌ మార్కెట్‌లో పత్తి ధర రూ.7,910

ABN , First Publish Date - 2022-11-04T23:09:32+05:30 IST

గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర గరిష్ఠంగా రూ.7,910 పలికింది.

గజ్వేల్‌ మార్కెట్‌లో పత్తి ధర రూ.7,910

గజ్వేల్‌, నవంబరు 4: గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర గరిష్ఠంగా రూ.7,910 పలికింది. గజ్వేల్‌ మార్కెట్‌కు ఇప్పుడిప్పుడే పత్తి రావడం ప్రారంభం కాగా శుక్రవారం ఐదుగురు రైతులు 24.71 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. కాగా గరిష్ఠంగా రూ.7910 పలుకగా, అత్యల్పంగా రూ.7856 పలికిందని మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. మక్కలకు రూ.2169 అత్యధిక ధర పలకగా, అత్యల్పంగా రూ.2130 పలికింది. పత్తిని ఆరబెట్టి తేమ లేకుండా తీసుకురావాలని కార్యదర్శి తెలిపారు.

Updated Date - 2022-11-04T23:09:39+05:30 IST