న్యాయవాద వృత్తి బాధ్యతాయుతమైనది

ABN , First Publish Date - 2022-11-27T22:57:22+05:30 IST

బెజ్జంకి, నవంబరు 27: సమాజంలో న్యాయవాద వృత్తి బాధ్యతాయుతమైనదని కరీంనగర్‌ జిల్లా జడ్జి బీ.ప్రతిమ అన్నారు.

న్యాయవాద వృత్తి బాధ్యతాయుతమైనది

కరీంనగర్‌ జిల్లా జడ్జి బీ.ప్రతిమ

బెజ్జంకి, నవంబరు 27: సమాజంలో న్యాయవాద వృత్తి బాధ్యతాయుతమైనదని కరీంనగర్‌ జిల్లా జడ్జి బీ.ప్రతిమ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం, సామూహిక వనభోజన మహోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక సమరసతకై న్యాయవాదులు పాటుపడాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని జడ్జిలు, న్యాయవాదులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జడ్జిలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి ఎం.వాణి, నాలుగవ జిల్లా అదనపు జడ్జి కుమార్‌వివేక్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అరుణ, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ సుజయ్‌కుమార్‌, ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జి పీ.లక్ష్మీకుమారి, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ కోహిర్‌కార్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.హేమలత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజిరెడ్డి, నాగరాజు, న్యాయవాదులు మహేందర్‌, గణేష్‌, శ్రీధర్‌రావు, శ్రీకాంత్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:57:23+05:30 IST