గుట్టుచప్పుడుగా ‘డబుల్‌’ ఇళ్ల డ్రా!

ABN , First Publish Date - 2022-08-04T05:46:46+05:30 IST

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభు త్వం సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామశివారులో, హనుమాన్‌నగర్‌ గ్రామ సమీపంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది.

గుట్టుచప్పుడుగా ‘డబుల్‌’ ఇళ్ల డ్రా!

మీడియాకు సమాచారమివ్వని అధికారులు


సంగారెడ్డిరూరల్‌,ఆగస్టు3: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభు త్వం సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామశివారులో, హనుమాన్‌నగర్‌ గ్రామ సమీపంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించేందుకు కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు బుధవారం డ్రా తీసేందుకు నిర్ణయించారు. అయితే లబ్ధిదారులకు, మీడియా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదు. సంగారెడ్డి మండలానికి చెందిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి కొండాపూర్‌ మండల పరిధిలోని మల్కాపూర్‌ గ్రామసమీపంలో గల ఓ ఫంక్షన్‌ హాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీవో నగే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఎక్కడ డ్రా తీస్తున్నారో తెలియని లబ్ధిదారులు ఎక్కడికి  వెళ్లాలో తెలియక ఇబ్బందులుపడ్డారు. సంగారెడ్డి మండలంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం మొత్తం 6,500 మంది దరఖాస్తు చేసుకోగా 1,378 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ నిర్మించిన ఇళ్లు 329 మాత్రమే ఉండడంతో డ్రాలో మొదటగా వచ్చిన వారికి కేటాయించారు. కార్యక్రమంలో సంగారెడ్డి తహసీల్దార్‌ స్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:46:46+05:30 IST